భారతదేశం, జనవరి 16 -- రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్‌వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. గతంలో 10 జిల్లాలు ఉండగా. బీఆర్ఎస్ హయాంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ముందుగా 31 జిల్లాలను ఏర్పాటు చేయగా. ఆ తర్వాత మరో 2 జిల్లాలపై కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలున్నాయి. రెవెన్యూ మండలాల సంఖ్య కూడా 612కి చేరగా. రెవెన్యూ డివిజన్లు 74కు చేరాయి.

ఇక బీఆర్ఎస్ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో అనేక డిమాండ్లు వచ్చాయి. వాటిలో కొన్నింటిని పరిగణనలోకి తీసుకున్న నాటి ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అయితే నాటి ప్రభుత్వ నిర్ణయంతో కొన్ని జిల్లాల స్వరూపమే మారిపోయిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల విషయంలో ఈ విమర్శలున్నాయి.

కాంగ్రెస్ పార్టీ అధికారం...