Tirumala,andhrapradesh, మే 2 -- శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. మే 4వ తేదీన స్థానిక దర్శన కోటా టోకెన్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ప్రతి నెలా మొదటి మంగళవారం (మే 6వ తేదీ) స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా ఈ టోకెన్లను జారీ చేయనున్నట్లు వెల్లడించింది.
తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలో టోకెన్లు అందజేస్తారు. ఇక తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఇస్తారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుండి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేస్తారని టీటీడీ తెలిపింది.
ఈ విషయాన్ని గమనించి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
మే 6 నుంచి 8వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి శ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.