Andhrapradesh, మే 28 -- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. వచ్చే జూన్ నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను తెలిపింది. జూన్ 5న మెయిన్ వ‌ర‌ద‌రాజ‌స్వామి వర్ష తిరు న‌క్ష‌త్రం, జూన్ 9న శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభమవుతుందని వెల్లడించింది. టీటీడీ ప్రకటించిన వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి.

*⁠ ⁠జూన్ 5న మెయిన్ వ‌ర‌ద‌రాజ‌స్వామి వర్ష తిరు న‌క్ష‌త్రం.

*⁠ ⁠జూన్ 9న శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం, న‌మ్మాళ్వార్ శాత్తుమొర‌.

*⁠ ⁠జూన్ 11న శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం స‌మాప్తం.

*⁠ ⁠జూన్ 21 స్మార్త ఏకాద‌శి.

*⁠ ⁠జూన్ 22న వైష్ణ‌వ మాధ్వ ఏకాద‌శి.

*⁠ ⁠జూన్ 26న పెరియాళ్వార్ ఉత్స‌వ ఆరంభం.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం 82,597 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,803 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 3.52 కోట్లు హుండీ కా...