భారతదేశం, జనవరి 4 -- శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో కలిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 4వ తేదీ తిరుమలలో జరుగనుంది. ఏటా వైకుంఠ ఏకాదశి ముగిసిన ఆరు రోజుల తర్వాత శ్రీవారి ప్రణయకలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంటలకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వద్ద ఒకరికొకరు ఎదురేగుతారు.
ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.