భారతదేశం, ఆగస్టు 17 -- శిశువుల పాలిట ఒక వరం.. చనుబాలు. కానీ, చాలామంది కొత్త తల్లులు పాలు తక్కువగా వస్తున్నాయని ఆందోళన పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారాలు ఉన్నాయని, కొన్ని చిట్కాలు పాటిస్తే పాల ఉత్పత్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. మనస్తత్వ శాస్త్రం, పోషణ, ఆరోగ్యం.. ఈ మూడింటి కలయికతో పాలిచ్చే తల్లులకు పూర్తి మార్గదర్శనం ఇస్తుంది ఈ కథనం.

పాలివ్వడం అనేది ఒక సహజ ప్రక్రియ అయినా, చాలామంది కొత్త తల్లులు పాలు సరిగా రావడం లేదని ఇబ్బంది పడుతుంటారు. పాల ఉత్పత్తి తక్కువగా ఉందని ఆందోళన చెందడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, నిరాశకు గురవడం వంటివి జరుగుతుంటాయి. ఈ విషయంలో పటియాల మణిపాల్ హాస్పిటల్‌కు చెందిన పీడియాట్రిక్స్, నియోనాటాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నీరజ్ అరోరా 'హెచ్‌టి లైఫ్‌స్టైల్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిపార...