భారతదేశం, ఫిబ్రవరి 21 -- మెగా-అల్లు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది. అల్లు శిరీష్-నయనికా రెడ్డి వివాహ వేడుకల్లో భాగంగా అల్లు అర్జున్ ఏర్పాటు చేసిన ప్రీ-వెడ్డింగ్ పార్టీకి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు హాజరయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

మెగా, అల్లు కుటుంబాల్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. మార్చి 6వ తేదీన నయనికా రెడ్డితో అతని పెళ్లి ఘనంగా జరగనుంది. ఈ క్రమంలోనే అల్లు కుటుంబంలో వేడుకలు అప్పుడే అంబరాన్నంటాయి.

కొద్దిరోజుల కిందట దుబాయ్‌లో నిర్వహించిన 'యాట్ పార్టీ' ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో అల్లు కుటుంబం ఒక ప్రైవేట్ ప్రీ-వెడ్డింగ్ పార్టీని ని...