భారతదేశం, జనవరి 13 -- టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా హిందీలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తమన్నా భాటియా బాలీవుడ్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ఓ రోమియో. ఈ సినిమాలో హీరోగా షాహిద్ కపూర్ చేశాడు.

అయితే, వెర్సటైల్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన చిత్రం 'ఓ రోమియో' (O Romeo). ఇటీవల విడుదలైన ఓ రోమియో టీజర్‌తో భారీ అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఇప్పుడు అనూహ్యంగా అండర్‌ వరల్డ్ వివాదంలో చిక్కుకుంది.

ముంబైకి చెందిన దివంగత గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా ఫ్యామిలీ నుంచి ఓ రోమియో చిత్రబృందానికి బెదిరింపులు వచ్చాయి. ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా కుమార్తె సనోబర్ షేక్ ఓ రోమియో చిత్ర నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా, దర్శకుడు విశాల్ భరద్వాజ్‌లకు నోటీసులు పంపడం ఇప్పుడు బాలీవుడ్‌లో సంచలనంగా మారింది.

ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ షేక్ (హుస్సేన్ ఉస్తారా) ...