Hyderabad, మే 22 -- జనరేషన్ ఆల్ఫా మన సంస్కృతి, సాంప్రదాయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ నటి అనసూయ పెద్ద కొడుకు మాత్రం ఎంతో పద్ధతిగా ఉపనయనానికి సరే అన్నాడు. ఈ మధ్యే వేడుక కూడా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. శౌర్య భరద్వాజ్ ను చూసి గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పింది.

నటి అనసూయ ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యే ఆమె కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అనాథాశ్రమంలో తన బర్త్ డే జరుపుకుంది. ఇక ఇప్పుడు ఆమె పెద్ద కొడుకు శౌర్య భరద్వాజ్ ఉపనయనం జరిగింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా ద్వారా చెబుతూ ఆ వీడియోను షేర్ చేసింది. "డియరెస్ట్ శౌర్య భరద్వాజ్. నా పెద్ద కొడుకు. నేనెప్పుడూ ఇంత గర్వపడలేదు.

దీనికోసం ఓ వేడుక ప్రత్యేకంగా అవసరం లేదని తెలుసు. ఎందుకంటే నువ్వెప్పుడూ నీతిగ...