భారతదేశం, మే 24 -- ీరు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దేశ రక్షణకు తోడ్పడాలనుకుంటే మీ కోసం గుడ్‌న్యూస్ ఉంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) 2025 సంవత్సరానికి సైంటిస్టు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ అవకాశం ఇంజనీరింగ్ పూర్తి చేసి దేశానికి సేవ చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్(డీఆర్‌డీఓ-ఆర్ఏసీ) సైంటిస్ట్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ ఉండనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rac.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఈ నియామక నోటిఫికేషన్ జూన్ మొదటి వారంలో ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురించబడే అవకాశం ఉంది. నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి 21 రోజుల్లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 148 సైంటిస్...