భారతదేశం, నవంబర్ 30 -- విశాఖపట్నంలోని ఐకానిక్ కైలాసగిరి కొండలు పర్యాటక రంగానికి మరింత ఊపునిచ్చేందుకు రెడీ అయ్యాయి. భారతదేశంలోనే అతి పొడవైన గాజు వంతెన డిసెంబర్ 1న ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఎంపీ శ్రీభరత్ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభిస్తారని VMRDA అధికారులు తెలిపారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్లాస్ స్కైవాక్ దాదాపు 55 మీటర్లు విస్తరించి కాంటిలివర్డ్ నిర్మాణంగా రూపొందించారు. దిగుమతి చేసుకున్న జర్మన్ గాజుతో తయారు చేసిన ఈ వాక్‌వే సందర్శకులకు భద్రత, ఉల్లాసకరమైన అనుభవాన్ని అందిస్తుంది.
సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తులో ఉన్న ఈ వంతెన బంగాళాఖాతం, తూర్పు కనుమలు, వైజాగ్ నగర అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. దీనిపై ఒకేసారి 100 మంది కూడా నడవవచ్చు. అయితే సౌకర్యం, సేఫ్టీ కోసం అధికారుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.