భారతదేశం, నవంబర్ 17 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 84 పాయింట్లు పెరిగి 84,563 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 31 పాయింట్లు వృద్ధిచెంది 25,910 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 136 పాయింట్లు పెరిగి 58,517 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,882.09 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8,159.34 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 65 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 26000 లెవల్స్​ వద్ద కీలకమైన రెసిస్టెన్స్​ ఉంది. 25,700 వద్ద కీలక సపోర్ట్​ ఉంది. ఈ రేంజ్​లో సూచీ కొనసాగినంత వరకు బ...