భారతదేశం, జనవరి 6 -- స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల ఫేవరెట్ స్టాక్‌గా పేరున్న టాటా గ్రూప్ సంస్థ ట్రెంట్ (Trent) కు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసిక (Q3FY26) గణాంకాలు విడుదలైన వెంటనే, మంగళవారం ట్రేడింగ్‌లో ఈ షేరు ఏకంగా 8 శాతం మేర పతనమైంది. బీఎస్ఈలో ఈ షేరు ధర రూ. 4060.65 వద్దకు పడిపోయింది. ఇది ఏప్రిల్ 2024 తర్వాత నమోదైన అత్యంత కనిష్ట స్థాయి కావడం గమనార్హం.
గత కొన్నేళ్లుగా మల్టీబ్యాగర్‌గా నిలిచిన ఈ స్టాక్, గత ఏడాది నిఫ్టీ 50లో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచిన షేర్లలో ఒకటిగా నిలిచింది. ఆదాయం తగ్గడం, అధిక వాల్యుయేషన్ ఆందోళనల మధ్య ఈ ఏడాది కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది.
ట్రెంట్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయం (GST మినహాయించి) ఏడాది ప్రాతిపదికన 17% పెరిగి రూ. 5,220 కోట్లక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.