భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రపంచం మొత్తం ఊగిపోతుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు లేకపోవడంతో ఈ చిరకాల ప్రత్యర్థులు కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడున్నాయి. అయితే ఇప్పుడు టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ ను పాకిస్థాన్ బాయ్ కాట్ చేసింది. కానీ టీమిండియాతో ఆడాలంటే మూడు కండీషన్లకు ఓకే చెప్పాలని ఐసీసీకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపిందనే వార్తలు వస్తున్నాయి.

టీ20 ప్రపంచకప్ లోె ఇండియాతో మ్యాచ్ ఆడాలని పాకిస్థాన్ పై అన్ని వైపుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం (ఫిబ్రవరి 8) రాత్రి లాహోర్ లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఐసీసీ ప్రతినిధి మధ్య మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లోనే టీమిండియాతో ప్రపంచకప్ లో ఆడాలంటే మూడు కండీషన్లను ఐసీసీ ముందు...