భారతదేశం, జూలై 27 -- ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ భారీగా ఉద్యోగుల కోతకు సిద్ధమవుతోంది. కంపెనీ తన మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం అంటే సుమారు 12,000 ఉద్యోగులను తొలగించవచ్చు. వచ్చే ఏడాది టీసీఎస్ నుంచి ఈ లేఆఫ్ జరగనుంది. టెక్నాలజీ వల్ల వచ్చిన మార్పులకు అనుగుణంగా మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండటానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని కంపెనీ సీఈఓ కృతివాసన్ చెప్పారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆపరేటింగ్ మోడళ్లలో కొత్త టెక్నాలజీకి మారుతున్నామని టీసీఎస్ సీఈఓ కె.కృతివాసన్ మనీకంట్రోట్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 'మనం చేసే పని తీరును మార్చుకుంటున్నాం. మనల్ని మనం సిద్ధంగా ఉంచుకోవాలి. కృత్రిమ మేధను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాం. అదే సమయంలో భవిష్యత్తులో మనకు అవసరమైన నైపుణ్యాలను కూడా అంచనా వేస్తున్నాం. మా భాగస్వాముల కెరీర్ ఎదుగుదలలో మ...