భారతదేశం, మే 3 -- తిరుమల తిరుపతి దేవస్థానం ఔత్సాహిక యువతకు ఆలయ నిర్మాణ శిల్పకళలో శిక్షణ ఇస్తుంది. శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళాశాలలో 4 సంవత్సరాల డిప్లొమా, 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సులలో (కళంకారి కళ) 2025-26 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది.

విద్యార్థులు మే 05, 2025 నుండి జూన్ 20, 2025 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులు స్వీకరించడానికి ఆఖరు తేది జూన్ 20, 2025. 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈ డిప్లొమా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సులలో చేరిన వారికి ఒక లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తారు.

పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి నిబంధనల మేరకు చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం www.tirumala.org చూడవచ్చు. లేదా ఫోన్ నెం. 0877-2264637, 9866997290 నంబర్లను సంప్రదించవచ్చు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణంలో నాలుగేళ్ల ...