భారతదేశం, జనవరి 22 -- రథ సప్తమి సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి అంటే జనవరి 23వ తేదీ నుంచి తిరుపతిలో మూడు రోజుల పాటు సర్వ దర్శన టోకెన్ల జారీని నిలిపివేసింది. ఈ టోకెన్లు జారీచేసే మూడు ప్రాంతాల్లో నిలిపివేయాలని నిర్ణయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. దీనిప్రకారం.. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో మరుసటి రోజు దర్శనాలకు జారీ చేసే సర్వదర్శనం టోకెన్లు జనవరి 23, 24, 25వ తేదీల్లో జారీ చేయరు.
మరోవైపు ఈ నెల 23వ తేదీ దర్శనానికి సంబంధించి టోకెన్లను గురవారం జారీ చేస్తారు. మళ్లీ రథ సప్తమి ముగిసిన తర్వాత 26వ తేదీ నుంచి మరుసటి రోజు సర్వదర్శన టోకెన్లు ఇస్తారు. ఈ మేరకు టీటీడీ భక్తులకు తెలిపింది. సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేసింది.
జనవరి 25వ తేదీన రథ సప్తమి కోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.