భారతదేశం, సెప్టెంబర్ 17 -- తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(టీజీఎస్‌ఆర్టీసీ) రాష్ట్రంలోని పలు జోన్‌లలో ఖాళీగా ఉన్నన 1743 డ్రైవర్ శ్రామిక్ ఖాళీల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

తాజాగా వచ్చిన నోటిఫికేషన్‌లో మెుత్తం 1,743 పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్‌ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్‌ 8 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పోస్టులకు www.tgprb.in లో అ...