భారతదేశం, మే 21 -- టాలెంట్‌తో పాటు సినిమా చేయాల‌నే కోరిక‌, ఆశ బ‌లంగా ఉండి కూడా ఎవ‌రికి కాంటాక్ట్ కావాలో, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియ‌క ఇబ్బందులు ప‌డేవారు ఇండ‌స్ట్రీలో చాలా మంది క‌నిపిస్తారు. ఇలాంటి యంగ్ టాలెంట్‌ను ప్రోత్స‌హించేందుకు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు ఓ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లాంఛ్ చేయ‌బోతున్నారు. దిల్‌రాజు డ్రీమ్స్ పేరుతో ప్రారంభం కాబోతున్న ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ జూన్ నెల నుంచి అందుబాటులోకి రానుంది.

కెరీర్ ప్రారంభం నుంచి కొత్త‌ కంటెంట్‌ను, టాలెంట్ ను ప్రోత్సహించే దిల్ రాజు ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా యంగ్ టాలెంట్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసేందుకు సిద్ధ‌మ‌వుతోన్నారు.

ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగం కావాలనుకునే వారు https://dilrajudreams.com/ లింక్‌పై క్లిక్ చేసి తమ వివరాలను నమోదు చేస్తే, దిల్ రాజు డ్రీమ్స్ బృందం స్వయ...