భారతదేశం, జూన్ 28 -- టాటా మోటార్స్​ సంస్థ మంచి జోరు మీదుంది! టాటా హారియర్​ ఈవీని ఇటీవలే లాంచ్​ చేసిన ఈ సంస్థ, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్​ కారులో కొత్త ఎడిషన్​ని కూడా ప్రవేశపెట్టింది. దీని పేరు టాటా హారియర్​ ఈవీ స్టెల్త ఎడిషన్​. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 28.24 లక్షలు. టాటా హారియర్ ఈవీ స్టెల్త్ ఎడిషన్ కేవలం 75 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే లభిస్తుంది. అయితే ఇది 4 విభిన్న వేరియంట్లలో వస్తుంది. ఈ ప్రత్యేక ఎడిషన్ ఎస్‌యూవీలో 'ఎంపవర్డ్ 75 స్టెల్త్', 'ఎంపవర్డ్ 75 స్టెల్త్ ఏసీఎఫ్‌సీ', 'ఎంపవర్డ్ 75 క్యూడబ్ల్యూడీ స్టెల్త్', 'ఎంపవర్డ్ 75 క్యూడబ్ల్యూడీ స్టెల్త్ ఏసీఎఫ్‌సీ' వేరియంట్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

ఈ ప్రత్యేక 'స్టెల్త్ ఎడిషన్' ఎస్‌యూవీ అదనపు ఖర్చుతో అనేక ప్రత్యేక ఫీచర్లు, అదనపు హంగులతో వస్తుంది. వాటిలో...