భారతదేశం, ఫిబ్రవరి 12 -- దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ (JEE Main) 2026 సెషన్-1 ఫలితాల ప్రకటనలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12న విడుదల కావాల్సిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వాయిదా వేసింది.

తాజా సమాచారం ప్రకారం, జేఈఈ మెయిన్ సెషన్-1 స్కోర్‌కార్డులు నాలుగు రోజులు ఆలస్యంగా, అంటే ఫిబ్రవరి 16న అందుబాటులోకి రానున్నాయి. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఇది కొంత నిరాశ కలిగించే వార్త అయినప్పటికీ, అడ్మిషన్ల ప్రక్రియలో పారదర్శకత కోసం ఎన్‌టీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల ...