భారతదేశం, జూన్ 8 -- జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) మృతి చెందారు. జూన్ 5వ తేదీన గుండెపోటు సమస్యతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చించారు. గత మూడు రోజులుగా చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 5.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీలో పలు బాధ్యతలను నిర్వర్తించారు. టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేశారు.
2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 ఎన్నికల్లోనూ ఆ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
పార్టీ సీనియర్ నేత, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.