Telangana,hyderabad, జూలై 30 -- రాష్ట్రంలో మరోసారి ఉపఎన్నిక రాబోతుంది. ఈ బైపోల్ తో రాష్ట్ర రాజకీయాలు మరో లెవల్ కి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో డైలాగ్ వార్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయితే అనారోగ్యంతో ఆయన ఇటీవలే మృతి చెందారు. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక రావటం ఖాయమైపోయింది. రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది.

జూబ్లీహిల్స్ స్థానానికి ఉపఎన్నిక రానున్న...