భారతదేశం, నవంబర్ 14 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల తేడాతో భారీ విక్టరీని నమోదు చేశారు. ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. గాంధీభవన్ లో సందడి వాతావరణం నెలకొంది.

ఈ ఉపఎన్నిక ఫలితంపై ఎన్నికల సంఘం కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనుంది. గెలుపొందిన అభ్యర్థికి ధ్రువీకరణపత్రం అందజేయనుంది. నవీన్ యాదవ్ ఇంటి వద్ద ఆయన అనుచరులు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ కు 98,988(50.83%) పోలవగా. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259(38.13%) ఓట్లు దక్కాయి. ఇక బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దీపక్ రెడ్డికి డిపాజిట్ దక్కలేదు. కేవలం ఆయనకు 17,061(8.76%) ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

2023 ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్...