భారతదేశం, మే 26 -- హైదరాబాద్ లో జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని సోదరులు తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీ చేయనున్నారు.
మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఏడాది బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. గత 178 ఏళ్లుగా బత్తిని కుటుంబం చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆస్తమా, శ్వాసకోశ సమస్యల నుంచి చేప ప్రసాదం ఉపశమనం కలిగిస్తుందని ప్రజల నమ్ముతుంటారు.
చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఉబ్బసం బాధితులు హైదరాబాద్ కు వస్తుంటారు. రెండ్రోజుల ముందే వీరంతా నగరానికి చేరుకుంటారు. ఈ ఏడాది జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయాలని బత్తిని సోదరులు నిర్ణయించారు.
Published by HT Digital Content Services with permission from ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.