Hyderabad, మే 8 -- తెలుగు ప్రేక్షకులకు ఇరవై నాలుగు గంటలు నాన్​‌స్టాప్​ వినోదం అందించే జీ తెలుగు ఈ వారం మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న సూపర్​ హిట్​ తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా 'రాబిన్‌హుడ్​'​ వరల్డ్ టెలివిజన్​​ ప్రీమియర్‌​గా అందిస్తోంది.

అలాగే, చిన్నపిల్లల్లోని నటనా ప్రతిభను వెలికితీస్తూ అశేష ప్రేక్షకాదరణతో కొనసాగుతున్న డ్రామా జూనియర్స్​ 8 ఈ వారం మాతృ దినోత్సవం ప్రత్యేక ఎపిసోడ్‌​తో అలరించేందుకు సిద్ధమైంది. ప్రారంభం నుంచి జీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జీ తెలుగు సూపర్​ సీరియల్​ ఛాంపియన్​‌షిప్ ఈ వారం​ ఫినాలేకి చేరుకుంది.

అంతేకాకుండా కుటుంబ కథతో పవన్ సాయి, అక్షిత, భావన ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న సరికొత్త సీరియల్​ ఘరానా మొగుడు ప్రారంభం కానుంది. యాక్షన్​ ఎంటర్​...