భారతదేశం, డిసెంబర్ 23 -- తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోని మెుండి బకాయిలు ఉన్న ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక రాయితీని ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి హైదరాబాద్‌లో బకాయి ఉన్న ఆస్తి పన్నులపై వడ్డీలో 90 శాతం మాఫీని అందించే వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) పథకాన్ని ప్రకటించింది. పన్ను చెల్లింపుదారుడు అసలు మొత్తాన్ని, 10 శాతం వడ్డీని ఒకేసారి చెల్లించినట్లయితే ఇది వర్తిస్తుంది.

గ్రేటర్ హైదరాబాద్‌ పరిమితుల్లోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి ఓటీఎస్ కింద మెుండి బకాయిలన్నీ ఒకేసారి చెల్లిస్తే వడ్డీపై 90 శాతం రాయి...