భారతదేశం, సెప్టెంబర్ 12 -- పండుగల సీజన్ దగ్గర పడుతుండటంతో, ఆన్‌లైన్ షాపింగ్ పెరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గూగుల్ తన జీమెయిల్​లో రెండు కొత్త అప్‌డేట్స్‌ను ప్రకటించింది. ఇవి వినియోగదారుల ఇన్‌బాక్స్‌ను మరింత క్రమబద్ధంగా, సులభంగా నిర్వహించడానికి సహాయపడతాయి.

1. పర్చేజెస్​ ట్యాబ్​..

ఇకపై మీరు ఆన్‌లైన్‌లో చేసే కొనుగోళ్లకు సంబంధించిన అన్ని ఆర్డర్ కన్ఫర్మేషన్, షిప్పింగ్ వివరాలు ఒకే చోట కనిపిస్తాయి. దీనికోసం ప్రత్యేకంగా Purchases అనే కొత్త ట్యాబ్‌ను గూగుల్ తీసుకువచ్చింది. ఇకపై మీరు డెలివరీ వివరాల కోసం వేర్వేరు ఈమెయిల్స్‌ వెతకాల్సిన అవసరం లేదు. ఈ కొత్త ఫీచర్ ద్వారా అన్ని ఆర్డర్లు ఒకే జాబితాలో కనిపిస్తాయి. అంతేకాకుండా 24 గంటల్లోగా డెలివరీ అయ్యే ప్యాకేజీలు ఇన్‌బాక్స్ పైన కనిపిస్తాయి. ఈ ఫీచర్ వ్యక్తిగత గూగుల్ ఖాతాదారులందరికీ మొబైల్, ...