భారతదేశం, సెప్టెంబర్ 22 -- పండుగ సీజన్‌ను పురస్కరించుకుని టాటా మోటార్స్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓ అడుగు ముందుకేసింది. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ నిర్ణయంతో కార్ల ధరలు తగ్గాయి. ఇప్పుడు టాటా అదనంగా ఫెస్టివల్ డిస్కౌంట్లను ప్రకటించింది! దీనితో మోడల్‌ను బట్టి కొనుగోలుదారులకు దాదాపు రూ. 2 లక్షల వరకు భారీగా ఆదా అవుతుంది. అయితే ఈ ఆఫర్లు సెప్టెంబర్ 30, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది.

ఈ ప్రత్యేక ఆఫర్ల ద్వారా ఎస్‌యూవీ కొనుగోలుదారులకు అత్యధిక ప్రయోజనం లభిస్తుంది. నెక్సాన్, సఫారీ, హారియర్ మోడళ్లపై జీఎస్టీ రేట్ల కోత- టాటా ఫెస్టివల్ ఆఫర్‌తో కలిపి రూ. 2 లక్షల వరకు తగ్గింపు వస్తోంది. ఒక్క నెక్సాన్‌పైనే జీఎస్టీ తగ్గింపుతో రూ. 1.55 లక్షలు, అదనపు పండుగ ఆఫర్‌తో మరో రూ. 45,000 ఆదా అవుతుంది. ఇక సఫారీ, హా...