భారతదేశం, నవంబర్ 5 -- సీన్ సీన్ కూ ఉత్కంఠ పెంచుతూ, వేరే లెవల్ హారర్ తో వణికిించే ఓ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. సూపర్ హిట్ గా నిలిచిన కొరియన్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ 'డార్క్ నన్స్' జియోహాట్‌స్టార్‌లోకి అడుగుపెట్టింది. ఓ కుర్రాడికి పట్టే దెయ్యాన్ని తరిమేసేందుకు ఇద్దరు సిస్టర్స్ చేసే ప్రయత్నమే ఈ సినిమా.

కొరియన్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ డార్క్ నన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ మూవీ జియోహాట్‌స్టార్‌లోకి కొత్తగా అడుగుపెట్టింది. ఒక గంటా 54 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ థ్రిల్లర్ ఇప్పుడు జియోహాట్‌స్టార్‌ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో అదరగొట్టి, బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ నూ ఎంటర్ టైన్ చేస్తోంది.

డార్క్ నన్స్ మూవీ తెలుగులోనూ అందుబాటులో ఉంది. కొరియన్ హారర్ థ్రిల్లర్ అయినప్పటికీ ఇంగ్లీష్, హింద...