భారతదేశం, జనవరి 11 -- తెలంగాణ స్కిల్స్ అకడమిక్స్ అండ్ ట్రైనింగ్(T-SAT) నెట్‌వర్క్ జనవరి 12 నుండి మొత్తం 112 రోజుల పాటు EAPCET (ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) 2026-27 కోసం డిజిటల్ కంటెంట్‌ను ప్రసారం చేయనుంది. దీని ద్వారా విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం ఉండనుంది. ఉచితంగా విద్యార్థులు క్లాసులు విని నేర్చుకోవచ్చు. తద్వారా పరీక్షకు సన్నద్ధం కావొచ్చు.

రాబోయే విద్యా సంవత్సరంలో పోటీ పరీక్షలలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడంలో సహాయపడటానికి మే 2 వరకు విద్యార్థుల కోసం మొత్తం 450 ఎపిసోడ్‌లు ప్రసారం చేస్తారు. ముఖ్యంగా ప్రైవేట్ కోచింగ్ అందుబాటులో లేని పేద, గ్రామీణ విద్యార్థులకు ఉచిత తరగతులు అందిస్తుంది T-SAT.

గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రంలో సబ్జెక్టుల వారీగా డిజిటల్ పాఠాలు T-SAT శాటిలైట...