భారతదేశం, డిసెంబర్ 26 -- సంక్రాంతి వస్తుందంటే చాలు సెలవుల కోసం బడి పిల్లలు ఎదురూచూస్తుంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా సొంత ఊర్లకి పయనమవుతారు. సరదాగా వారంరోజుల పాటు బంధువులు, గ్రామస్థులతో సంతోషంగా గడుపుతుంటారు. అయితే ప్రభుత్వం ప్రకటించే సెలవులను చూసుకునే.. వారి ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈసారి కూడా సంక్రాంతి పండగకి ఎక్కువగానే సెలవులు ఉండనున్నాయి.

ఈసారి ప్రభుత్వ, ప్రైవేట్ బడుల విద్యార్థులకు జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు ఉండున్నాయి. జనవరి 18 వరకు అంటే మొత్తం 9 రోజుల పాటు సెలవులు ఉంటాయి. ఆ తర్వాత అంటే జనవరి 19వ తేదీ బడులన్నీ తిరిగి తెరుచుకుంటాయి.

ప్రతి ఏటా ఉండే విధంగానే ఈసారి కూడా పండుగ ముందు రోజునే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే సెలవులు ముగిసిన వెంటనే జనవరి 19 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

మకర స...