భారతదేశం, మే 9 -- జమ్మూలోని సాంబా సెక్టార్ గుండా భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కు చెందిన ఏడుగురు ఉగ్రవాదులను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గురువారం రాత్రి జరిపిన ఆపరేషన్లో హతమార్చినట్లు సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆపరేషన్ సందర్భంగా చొరబాటుదారులకు మద్దతుగా భారత్ వైపు పాక్ రేంజర్స్ పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. ప్రతిగా బీఎస్ఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో పాకిస్తాన్ సరిహద్దు ఔట్ పోస్టు ధ్వంసమైంది.

జమ్మూ ఫ్రాంటియర్ సాంబా సెక్టార్లో, 2025 మే 8, 9 తేదీల మధ్య రాత్రి, పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. దీనిని నిఘా గ్రిడ్ గుర్తించింది. ఈ చొరబాటు ప్రయత్నానికి ధంధార్ పోస్ట్ నుంచి, ఆ తర్వాత పాక్ రేంజర్ల నుంచి కాల్పులు జరిగాయి. అప్రమత్తమైన బీఎస్ఎఫ్ దళాలు చొరబాటు యత్నాన్ని తిప్పికొట్టాయి. కనీ...