భారతదేశం, జూలై 8 -- చైనాలో ఇప్పుడు కొత్త రకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సెక్స్ బొమ్మలు మార్కెట్‌ను ఏలుతున్నాయి. ఇవి కేవలం శారీరక సుఖం కోసమే కాదు, ఎమోషనల్‌గా మాట్లాడటానికి, తోడుగా ఉండటానికి కూడా ఉపయోగపడతాయట. ఈ బొమ్మలు చూడటానికి అచ్చం మనుషుల్లాగే ఉండి, అత్యాధునిక AI ఫీచర్లతో సంచలనం సృష్టిస్తున్నాయి. చైనా ఈ వింత రంగంలో ముందు దూసుకుపోతోంది.

సిలికాన్‌తో తయారైన ఈ బొమ్మల ధర $3,000 (మన లెక్కల్లో దాదాపు 2.5 లక్షలు) వరకు ఉంటుందట. శారీరక, మానసిక తోడును కోరుకునే మగవాళ్ల నుంచి డిమాండ్ బాగా పెరిగిపోవడంతో, చైనాలోని ఫ్యాక్టరీలు వీటిని పెద్ద ఎత్తున తయారు చేస్తున్నాయి.

WMDoll అనే ప్రముఖ తయారీ కంపెనీ ఈ ఏడాది అమ్మకాలు 30% పెరుగుతాయని అంచనా వేస్తోంది. ముఖ్యంగా సరైన భాగస్వామి దొరకని మగవాళ్లు వీటిని ఎక్కువగా కొంటున్నారట. "ఈ బొమ్మలు బాగా స్పందిస్తాయి. సంభా...