భారతదేశం, ఫిబ్రవరి 9 -- తిరుమలకు వచ్చారంటే.. లడ్డూలు తీసుకోకుండా ఏ ఒక్క భక్తుడూ వెళ్లడు. తిరుమల లడ్డూలు దేశవ్యాప్తంగా ఫేమస్. శ్రీవారి ప్రసాదం రుచిలో కూడా అమోఘం. అయితే లడ్డూల కోసం క్యూలైన్లలో నిలుచున్నప్పుడ్డు చేతిలో డబ్బులు పట్టుకోవాల్సిన పరిస్థితి. దీంతో టీటీడీ మరో ఆలోచన చేస్తోంది. లడ్డూ విక్రయ కేంద్రంలోని ప్రతీ కౌంటర్ వద్ద యూపీఐ పేమెంట్ అవకాశం కల్పించేందుకు ప్రణాళికలు వేస్తోంది.

తిరుమలలో ప్రతీ ఏడాది లడ్డూ విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయి. కౌంటర్ వద్ద డబ్బులు లేవని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. భక్తులు పడుతున్న ఇబ్బందులు చూసిన టీటీడీ కొత్త ఆలోచన చేస్తోంది. లడ్డూ విక్రయ కేంద్రాల్లో యూపీఐ పేమెంట్‌కు అవకాశం కల్పించాలని చూస్తోంది. దీంతో కౌంటర్ల వద్ద భక్తులు నగదు చెల్లించి.. లడ్డూలు పొందే ఇబ్బంది తప్పుతుంది. చాలా మంది ఇప్పుడు పేమెంట్స్ ఎక్కువగా...