భారతదేశం, జూన్ 6 -- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి అయిన చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఉధంపూర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో దిగిన తర్వాత ప్రధాని మోడీ చీనాబ్ బ్రిడ్జి సైట్ కు వెళ్లి ఈ అద్భుతాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సీమాంతర సైనిక దాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన జమ్ముకశ్మీర్ లో పర్యటించడం ఇదే తొలిసారి.
ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టుపై ఎగ్జిబిషన్ ను వీక్షించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లతో మోదీ మాట్లాడారు. ఈ పర్యటన సందర్భంగా, కాశ్మీర్ ను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా అనుసంధానించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అమలు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.