భారతదేశం, నవంబర్ 13 -- సంక్షేమ పథకాల అమలులో భాగంగా మరో కొత్త పథకాన్ని తీసుకువస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఐదు సంవత్సరాలలోపు పిల్లల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా బాల భరోసా అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న చిన్నారులు మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందించనున్నారు. దీని ద్వారా పిల్లల ఆరోగ్యానికి ప్రభుత్వం అండగా ఉండనుంది. త్వరలోనే బాల భరోసా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా ఈ స్కీమ్‌ను పర్యవేక్షిస్తాయి.

కొన్ని రోజుల కిందట రాష్ట్రంలోని అంగన్‌వాడీ సిబ్బంది చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై సర్వే నిర్వహించారు. దానికి సంబంధించిన రిపోర్టులు ప్రభుత్వం వద్దకు వెళ్లాయి. సర్వేలో దాదాపు 8 లక్షల మంది చిన్నారులు పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా తె...