భారతదేశం, మే 17 -- వివిధ కోడింగ్ సంబంధిత పనులపై ఏకకాలంలో పని చేయగలిగే కొత్త క్లౌడ్ ఆధారిత సాఫ్ట్​వేర్ ఇంజనీరింగ్ ఏజెంట్​ని చాట్జీపీటీలో ప్రారంభించింది ఓపెన్ఏఐ. సంస్థ ప్రకారం.. ఈ కొత్త 'కోడెక్స్​' టూల్ ఫీచర్లను రాయడం, బగ్స్​ని పరిష్కరించడం, యూజర్ కోడ్​బేస్ గురించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వంటి టాస్క్​లను చేస్తుంది. ప్రతి టాస్క్​కి సొంత శాండ్​బాక్స్​ (ప్రైవేట్ కోడింగ్ ఎన్విరాన్​మెంట్​)ని ఉపయోగించుకుంది.

ఈ కోడెక్స్​.. ఓపెన్​ఏఐ లేటెస్ట్​ రీజనింగ్​ మోడల్​ ఓ3పై ఆధారపడి ఉంటుంది. సాఫ్ట్​వేర్​ ఇంజినీరింగ్​ సంబంధిత టాస్క్​ల కోసం ఆప్టిమైజ్​ చేయడం జరిగింది. "మానవ శైలి, పీఆర్ ప్రాధాన్యతలను దగ్గరగా ప్రతిబింబించే, సూచనలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండి, ఉత్తీర్ణత ఫలితాన్ని పొందే వరకు పరీక్షలను నిర్వహించగల" కోడ్​ని సృష్టించడానికి రియల్​ వరల్డ్​ కోడింగ్ పనులపై ...