భారతదేశం, ఏప్రిల్ 26 -- టాలీవుడ్‌కు యముడి సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. యముడి నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ దాదాపు హిట్టయ్యాయి. యమగోల, యముడికి మొగుడు, యమదొంగతో పాటు పలు సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. కొంత గ్యాప్ తర్వాత యముడి కథతో తెలుగులో ఓ మూవీ రాబోతుంది.
జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో యముడు మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శ్రావణి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.యముడు మూవీకి సంబంధించి కొత్త పోస్టర్‌ను శనివారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఉన్న ధర్మో రక్షతి రక్షితః అనే క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది.
ఈ పోస్టర్లో యుముడి రూపంలో హీరో జగదీష్ కనిపిస్తోన్నాడు. అతడి వెనకాల ఉన్న మహిషాకారం, యముడి చేతికి ఉన్న సంకెళ్లు ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్ను యమపాశంతో కట్టి పడేయటం ఆసక్తిని పం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.