Visakhapatnam,andhrapradesh, ఏప్రిల్ 19 -- గ్రేటర్ విశాఖ వైజాగ్ మేయర్ అవిశ్వాస వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. సభ్యులు నోటీసు ఇచ్చిన నాటి నుంచి లెక్కలు మారిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్ పై ఊగిసలాట కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం కానుంది. దీంతో జీవీఎంసీ దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ సమావేశాన్ని వీడియో చిత్రీకరించేలా ఏర్పాట్లు చేశారు. కోరానికి సరిపడా సభ్యులు ఉంటేనే ఓటింగ్‌ నిర్వహించనున్నారు. చేతులెత్తి ఓటుకు ఆమోదం తెలపనున్నారు. హాల్‌లో కార్పొరేటర్ల ప్రతి వరుసకు ఒక అధికారి ఉండనున్నారు. సభ్యులను రో అధికారులు కౌంట్‌ చేయనున్నారు. కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులకే మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన మేయర్ జి.హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానంప...