భారతదేశం, నవంబర్ 20 -- రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరోసారి రంగం సిద్ధమవుతోంది. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లేందుకు సర్కార్ సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఈసీ కూడా స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా పంచాయతీల్లో ఓటరు జాబితా సవరణకు తాజాగానే షెడ్యూల్ కూడా ప్రకటించింది.

ఇవాళ్టి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించే ప్రక్రియ షురూ అయింది. ఈనెల 23 వరకు ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. ఇవాళ ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణకు అవకాశం ఉండగా. ఈనెల 21వ తేదీన ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం ఉంటుంది. ఇక ఈనెల 23వ తేదీన ఫైనల్ ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల ప్రచురణ ఉంటుంది.

డిసెంబరు రెండో వారంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నిక...