భారతదేశం, మే 10 -- ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి, అఖిల భారత సాంకేతిక విద్యా మండలితో కలిసి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లను అందిస్తు్న్నాయి. ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు మే 18 లోపు సంబంధిత వెబ్ సైట్ https://internship.aicte-india.org/ లో దరఖాస్తు చేసుకోవాలి. వీటిలో సాధారణ ఇంటర్న్‌షిప్‌లతోపాటు ఉపకార వేతనాలు ఇచ్చేవి అందుబాటులో ఉన్నాయి.

మే 25 లోపు ఇంటర్న్ షిప్ లు

డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులు https://internship.aicte-india.org/ ఇంటర్న్ షిప్ పోర్టల్‌ లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆ తర్వాత సంబంధిత విద్యా సంస్థల మెంటార్లు ధ్రువీకరించాల్సి ఉంటుంది. మే 25లోపు విద్యార్థులకు ఇంటర్న్‌ షిప్‌ లు కేటాయిస్తారు. ఇంటర్న్ షిప్ సమయంలో కొన్ని సంస్థలు రూ.5 వేల నుంచి రూ.25 వేల స్టైఫండ్‌ ఇవ్వనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత వ...