భారతదేశం, జూన్ 18 -- భారతదేశ డిజిటల్ భవిష్యత్తును మరింత సురక్షితంగా మార్చడానికి గూగుల్ కట్టుబడి ఉందని హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ (GSEC) ప్రారంభోత్సవం తెలియజేస్తుంది. జూన్ 17న ఢిల్లీలో గూగుల్ సేఫ్టీ చార్టర్ ప్రారంభించిన మరుసటి రోజే ఈ కేంద్రం మొదలైంది.

ఇది ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో గూగుల్‌కు మొదటి సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది నాలుగోది.

గోప్యత (Privacy) & సైబర్ భద్రత (Cybersecurity): వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను కాపాడటం, సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పించడం.

బాధ్యతాయుతమైన AI అభివృద్ధి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI)ని నైతికంగా, బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయడం.

భద్రతా చార్టర్ అమలు: ఆన్‌లైన్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించడం, ప్రభుత్వ, సంస్థాగత సైబర్ భద్రతను బలోపేతం చేయడం, బాధ్యతాయుతమైన AIని అభ...