భారతదేశం, అక్టోబర్ 12 -- అరట్టై, జోహో తర్వాత.. దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన 'మ్యాపల్స్​' (Mappls) యాప్ భారత స్వదేశీ సాంకేతికత ప్రయత్నాలకు బలాన్ని చేకూరుస్తోంది!. అత్యధికంగా వినియోగించే గూగుల్ మ్యాప్స్‌కు దేశీయ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ఈ నావిగేషన్ మొబైల్ అప్లికేషన్‌కు ప్రభుత్వం నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఈ యాప్‌ను ఉపయోగిస్తున్న వీడియోను 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.

డిజిటల్ మ్యాప్, జియోస్పేషియల్ టెక్నాలజీ సంస్థ అయిన మ్యాప్‌మైఇండియా (MapmyIndia) రూపొందించిన మ్యాప​ల్స్​ యాప్‌లోని ఫీచర్లను వైష్ణవ్ ఆ వీడియోలో ప్రదర్శించారు. "మ్యాప్‌మైఇండియా నుంచి స్వదేశీ 'మ్యాపల్స్​'. మంచి ఫీచర్లు ఉన్నాయి... తప్పక ప్రయత్నించండి," అని ఆయన ఎక్స్​లో రాశారు.

గూగుల్ మ్యాప్స్ ప్...