భారతదేశం, మే 18 -- హైదరాబాద్ గుల్జార్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహా ఘటనాస్థలిని పరిశీలించారు. మృతులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ ప్రమాదంపై అన్ని శాఖల అధికారులతో చరిస్తూ ఎప్పటికప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారన్నారు.
ఆదివారం ఉదయం 6.16 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి ప్రమాదం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.