భారతదేశం, ఫిబ్రవరి 20 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో డబ్బింగ్ స్టూడియోలో శ్రుతి డబ్బింగ్ చెబుతుంది. తనతోపాటు మరొకరు చెబుతారు. ఇద్దరు భర్త, కాపురం, మరో అమ్మాయితో తిరగడం గురించి డబ్బింగ్ ఉంటుంది. ఇంతలో శోభన వస్తుంది. శ్రుతి వెళ్లి మాట్లాడుతుంది.

ఇప్పుడు నువ్వు చెప్పిన డైలాగే నీ జీవితానికి సంబంధించేలా ఉందని, సూపర్ మార్కెట్‌లో మరో అమ్మాయితో రవిని చూశానని శోభన చెబుతుంది. ఇద్దరు కలిసి ప్లేట్స్ చూస్తున్నారు. అది నాకు ముందే రవి చెప్పాడు అని శ్రుతి అంటుంది. ఆ అమ్మాయి వాలకం బాగోలేదు. నలుగురు చూస్తే బాగుండదు. అలాంటి అమ్మాయిలు రవి లాంటి మంచోళ్లను మార్చేస్తారే అని శోభన అంటుంది.

రవి అలా కాదు. నువ్వు కూడా డాడీ ఫ్రెండ్‌ ఒకాయనతో షాపింగ్‌కు వెళ్లావు కదా దాని గురించి నేను ఎప్పుడైనా ఏమైనా మాట్లాడానా అని రివర్స్‌లో తల్లినే అంటుంది శ్రు...