భారతదేశం, జనవరి 22 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో గుడిలో బాలు అన్నయ్య పుణ్యం చేశాడు కాబట్టి ముందుగా బాలు అన్నకే ముందు పుడతాడు అని రవి అంటాడు. కాదు మనోజ్‌కే పుడతాడు అని ప్రభావతి అంటుంది. మాకు నడిచి వచ్చే బిడ్డ పుడతాడని పంతులు చెప్పాడని మనోజ్ అంటాడు.

రోహిణి నడిపించుకుంటూ వస్తుందేమో అని మీనా అంటుంది. దాంతో రోహిణి షాక్ అవుతాడు. మాకు ఇప్పుడే పిల్లలు పుట్టాలని లేదు, ముందు ఇల్లు కట్టుకోవాలని బాలు అంటాడు. తర్వాత దేవుడికి దండం పెట్టుకున్న మీనా రోహిణి గురించి తెలిసిన నిజం గురించి ఎలా తెలుసుకోవాలనో మొక్కుకుంటుంది.

ఇంతలో బాలు వచ్చి తన వైరల్ అయిన వీడియో చూపిస్తాడు. మీనా పరధ్యానంగా ఉండటంతో ఏం జరిగింది, సంతోషంగా ఎందుకు లేవని నిలదీస్తాడు బాలు. మీకు మంచి పేరు వస్తే ఎక్కువగా సంతోషించేది నేనే కదా అన్న మీనా వంట గదిలో పని ఉందని వెళ్లిప...