భారతదేశం, జనవరి 23 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 604వ ఎపిపోడ్ లో రోహిణి బాగోతం మొత్తం బయటపడుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయింది. ఆమె ఇంట్లో వాళ్లకు అబద్ధం చెప్పి కొత్త నాటకానికి తెరలేపుతుంది. దీంతో అటు తిరిగి ఇటు తిరిగి మీనా మెడకే ఈ నింద చుట్టుకుంటుంది. దీంతో ప్రభావతి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (జనవరి 23) ఎపిసోడ్ రోహిణి విషయంలో ప్రభావతిని సత్యం నిలదీసే సీన్ తో మొదలవుతుంది. రోహిణికి రెండో ప్రెగ్నెన్సీ విషయం నీకు ముందే తెలుసు కదా అని ప్రభావతిని సత్యం నిలదీస్తాడు. ఆమెను నెత్తిమీద పెట్టుకొని చూసుకుంటావు కాబట్టి.. ఇదీ నీకు తెలుసని ఆమెను నిందిస్తాడు. కానీ ప్రభావతి మాత్రం సత్యప్రమాణకంగా తనకు ఈ విషయం తెలియదని, ఆ నిజమేంటో రోహిణినే అడిగి తేల్చుకుంటానని అంటుంది.

సత్యం వద్దని వారిస్తున్నా.. రో...