భారతదేశం, ఫిబ్రవరి 8 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో నిద్రలో నుంచి బాలు ఉలిక్కిపడి లేస్తాడు. వెంటనే మీనా నీళ్లు ఇస్తుంది. ఏమైందని అడుగుతుంది. మనిద్దరికి చాలా పెద్ద గొడవ అయిందని పీడకల వచ్చిందని బాలు అంటాడు.

మనం రోజు గొడవ పడుతూనే ఉంటాం కదా. కలలో మీరు అసలు నన్ను మాట్లాడినిచ్చారా అని సైటెర్లు వేస్తుంది మీనా. ఇది అలా కాదు. చాలా అరుచుకున్నామట అని బాలు అంటాడు. ఇద్దరు వాదించుకుంటారు. ఇప్పుడే గొడవ పడేలా ఉన్నామని, పడుకోండని మీనా అంటుంది. మీనాపై బాలు కాలు వేస్తాడు. ఏంటని అడిగితే చేయి కూడా వేస్తాడు.

అలా రొమాంటిక్‌గా బాలు, మీనా నైట్ సాగిపోతుంది. మరుసటి రోజు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు బాలు. అక్కడ బాలు ఫ్రెండ్ రాజేష్ మత్తులో స్తంభానికి ఒరిగి పడుకుంటాడు. అది చూసిన బాలు వీడేంటీ ఇలా పడుకున్నాడు అని మిగతా వాళ్లను అడుగుతాడు....