భారతదేశం, ఆగస్టు 16 -- ప్రముఖ నాన్-ఇన్వేసివ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బిమల్ ఛాజర్ తన వెబ్‌సైట్‌లో ఒక బ్లాగ్ పోస్ట్ రాశారు. ఈ బ్లాగ్‌లో గుండె జబ్బులకు చికిత్స చేయడానికి ఉపయోగపడే 10 ముఖ్యమైన రక్త పరీక్షల గురించి వివరించారు. ఈ పరీక్షలు మీ గుండె భవిష్యత్తు గురించి ఎన్నో రహస్యాలను వెల్లడిస్తాయని ఆయన అంటున్నారు. సాధారణంగా మనం చేసే పరీక్షలకు మించి, గుండె సమస్యలను ముందుగానే పసిగట్టేందుకు ఈ పరీక్షలు సహాయపడతాయని డాక్టర్ ఛాజర్ పేర్కొన్నారు. ఆ పది పరీక్షలు ఏమిటో చూద్దాం.

hs-CRP అనేది కాలేయం ఉత్పత్తి చేసే ఒక ప్రోటీన్. శరీరంలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ (మంట) ఉన్నప్పుడు దీని స్థాయి పెరుగుతుంది. ఇది కేవలం కొవ్వును మాత్రమే కొలవదు.. రక్త నాళాల్లో నిశ్శబ్దంగా రగిలే మంటను గుర్తిస్తుంది. ఈ పరీక్షలో 2.0 mg/L కంటే ఎక్కువ స్థాయి ఉంటే, ఇతర పరీక్షలన్నీ సాధారణంగా ఉన్నప్...