Guntur,andhrapradesh, ఏప్రిల్ 18 -- గుంటూరు జిల్లాలో ఘోరమైన సంఘ‌ట‌న చోటు చేసింది. మైన‌ర్ బాలికపై వ‌రుస‌కు మేన‌మామ అయ్యే వ్యక్తి లైంగిక దాడి చేశాడు. ఆ త‌రువాత ఆమె సోద‌రిపై లైంగిక దాడికి య‌త్నించాడు. ఆమె బ‌య‌ట‌కు ప‌రుగులు తీయ‌డంతో స్థానికులు అడ్డుకుని.. నిందితుడికి దేహ‌శుద్ధి చేసి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఈలోపు నిందితుడు.. స్థానికుల వ‌ద్ద నుంచి త‌ప్పించుకుని ప‌రార‌య్యాడు.

ఈ దారుణ ఘ‌ట‌న గుంటూరు జిల్లా తాడేప‌ల్లి ప‌ట్ట‌ణంలోని ఒక కాల‌నీలో చోటు చేసుకుంది. ఆల‌స్యంగా గురువారం వెలుగులోకి వ‌చ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. తాడేప‌ల్లి ప‌ట్ట‌ణంలోని ఒక కాల‌నీలో ఓ మ‌హిళ నివాసం ఉంటుంది. త‌న భ‌ర్త‌ను వ‌దిలేసి.. తన తండ్రి రెండో భార్య కుమారుడు కొండ‌పాటి అంక‌బాబుతో క‌లిసి ఒకే ఇంట్లో ఉంటోంది. ఆ మ‌హిళ‌ల‌కు న‌లుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద ...